వెనక్కి తగ్గని కమల్.. కన్నడలో 'థగ్ లైఫ్' కిరికిరి! హైకోర్టు వార్నింగ్..
Tue Jun 03, 2025 13:21 Entertainment.202506036634.jpg)
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. "కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. భావప్రకటనా స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్ కు కోర్టు తేల్చి చెప్పింది. "మీరు సామాన్యులు కారు. మీకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, కానీ ఇతరుల మనోభావాలను గాయపరిచే హక్కు లేదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కును వినియోగించుకోలేరు. ఇప్పుడు మేం ఈ విషయాన్ని మీకే వదిలేస్తున్నాం.. మీ వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణ చెప్పండి" అని కోర్టు పేర్కొంది. కమల్ హాసన్ కొత్త సినిమా 'థగ్ లైఫ్' గురువారం విడుదల కానున్న నేపథ్యంలో, "కర్ణాటక నుంచి కోట్ల రూపాయల ఆదాయం రావచ్చు...
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
కానీ కన్నడ ప్రజలు వద్దనుకుంటే ఆ ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది" అని కోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే మద్దతుతో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. అయితే, తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. "నా జీవితం, నా బంధుత్వం తమిళం. మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది, కాబట్టి మీరు కూడా అందులో భాగమే" అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా ఇదే ప్రకటన చేయడంతో కమల్ హాసన్ కోర్టుకెక్కారు. కాగా, కమల్ హాసన్ సినిమా 'థగ్ లైఫ్' విడుదలను కర్ణాటకలో అడ్డుకోవద్దని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) సోమవారం ఈ సినిమా ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధించింది. కమల్ క్షమాపణ చెప్పే వరకు సినిమా విడుదలకు అనుమతించేది లేదని కేఎఫ్‌సీసీ అధ్యక్షుడు ఎం.ఎం. నరసింహులు స్పష్టం చేశారు. అయితే, తాను తప్పు చేయలేదని, కాబట్టి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కమల్ హాసన్ గత శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ వివాదంపై కర్ణాటక బీజేపీ చీఫ్ వి. యడ్యూరప్ప కూడా కమల్ హాసన్‌పై మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #KamalHaasan #KarnatakaHighCourt #ThugLife #Kannadalanguage #Tamil languageorigin
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.